Advertisementt

ఫ్యాన్స్‌ను అలరించాలంటే ఆపరేషన్‌ తప్పనిసరి!

Sat 26th Mar 2016 12:17 PM
chiranjeevi,operation,srija marriage,chiru 150th film  ఫ్యాన్స్‌ను అలరించాలంటే ఆపరేషన్‌ తప్పనిసరి!
ఫ్యాన్స్‌ను అలరించాలంటే ఆపరేషన్‌ తప్పనిసరి!
Advertisement
Ads by CJ

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి తన కుడిభుజానికి ఆపరేషన్‌ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులపాటు ఆయన చేతికి కట్టుతోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన చిన్నకూతురు శ్రీజ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో కూడా ఆయన కట్టుతోనే కనిపించారు. కాగా త్వరలో ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరనున్నాడు. ఆయన తన ఎడమ భుజానికి కూడా ఆపరేషన్‌ చేయించుకోనున్నాడు. వచ్చేవారం శ్రీజ వివాహం అనంతరం ఆయన ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో చేరనున్నాడు. తన సినిమా రీఎంట్రీ కోసం రెడీ అవుతూ.. తన 150వ చిత్రంలో డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో ఇరగదీయాలంటే ఆపరేషన్‌ కంపల్సరీ అని డాక్టర్లు తేల్చేశారట. తన కెరీర్‌ మొత్తం విపరీతంగా ఎలాంటి రెస్ట్‌ లేకుండా కష్టపడి శ్రమించాడని, అందువల్లే ఆయనకు ఇప్పుడు భుజాల ఆపరేషన్‌ అసరమైందని సమాచారం. మొత్తానికి మరలా తన ఫ్యాన్స్‌ను ఆటపాటలతో అలరించాలంటే దానికి దేనికైనా సిద్దమే అని చిరు డిసైడ్‌ అయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ