'బాహుబలి' రికార్డులను బద్దలుకొట్టకపోయినా కూడా 'బాహుబలి' తెలుగువెర్షన్ రికార్డులను, మహేష్‌బాబు 'శ్రీమంతుడు' రికార్డ్‌లను పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్'తో తిరగరాయడం ఖాయమని మెగాభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. కాగా ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను చేజిక్కించుకున్న ఈ చిత్ర భాగస్వామి సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను విడుదల చేయనుంది. హిందీ హక్కులను ఈ సంస్థ 12కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. ఇది 'బాహుబలి' తర్వాత బాలీవుడ్‌లో అత్యధిక రేటుకు డబ్బింగ్ హక్కుల రేటును పలికిన రెండో చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను మాటీవీ చానెల్ ఏకంగా 13కోట్లకు సొంతం చేసుకుంది. ఇది కూడా 'బాహుబలి' తర్వాత అంతటి రేటు పలికిన చిత్రంగా 'సర్దార్' రికార్డ్స్ క్రియేట్ చేసింది. కాగా ఈచిత్రం యూనిట్ రెండు డ్యూయెట్ పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. ఈ రెండు పాటలను పూర్తి చేసుకొని ఒక వారం రోజుల్లో టీమ్ ఇండియకు తిరిగిరానుంది. కాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా ఏప్రిల్ మొదటి వారంలోపే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. బహుశా ఏప్రిల్ 2,3 తేదీల్లోనే ఈచిత్రం సెన్సార్‌కు వెళ్లనుందన సమాచారం. మరోపక్క ఈ చిత్రంలో బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న కాజల్, విలన్ శరద్ కేల్కర్‌లు నటిస్తుండటం కూడా ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ రావడానికి దోహదపడుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రం 100కోట్లకు పైగా బిజినెస్ చేయడం పవన్‌కు ఉన్న పవర్‌ఫుల్ స్టామినాకు అద్దంపడుతోందని అభిమానులు ఆనందంగా ఉన్నారు.