Advertisementt

మెగాహీరోల దృష్టి 'కుమారి'పై!

Fri 25th Mar 2016 11:09 PM
hebah patel,mega heroes,varun tej,srinuvaitla  మెగాహీరోల దృష్టి 'కుమారి'పై!
మెగాహీరోల దృష్టి 'కుమారి'పై!
Advertisement
Ads by CJ

'అలా..ఎలా' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ 'కుమారి21ఎఫ్‌'తోనే మంచి క్రేజ్‌ సాధించుకున్న కుర్రహీరోయిన్‌ హెబ్బాపటేల్‌. ఈ చిత్రంలో ఆమె నటనకు, బోల్డ్‌ సన్నివేశాల్లో ఆమె చూపిన గ్లామర్‌షో, టాలెంట్‌కు మంచి మార్కులు పడ్డాయి. పెద్ద అందగత్తె కాకపోయినా తన కవ్వించే కళ్లతో ఆకట్టుకుని యూత్‌లో మాంచి క్రేజ్‌ సాధించుకొంది హెబ్బాపటేల్‌. దాంతో ఆమెకు స్టార్‌ హీరోల సరసన కాకపోయినా యంగ్‌ హీరోల చిత్రాలలో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 'వీడోరకం...వాడో రకం' చిత్రంలో తనకు కలిసివచ్చిన హీరో రాజ్‌తరుణ్‌తో నటిస్తోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు-రాజ్‌తరుణ్‌లు హీరోలుగా నటిస్తుండగా, జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. అయితే ఆమెకు ఇటీవల అనుకోకుండా మెగాహీరో సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ పాత్రకు రకుల్‌ప్రీత్‌సింగ్‌ను అనుకొన్నప్పటికీ చివరికి ఆమెకు ఎర్త్‌పెట్టి ఆ పాత్రను హెబ్బా చేజిక్కించుకుంది. ఆ చిత్రమే వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం. ఒక్కసారి మెగాహీరోలలో ఒకరితో కలిసి నటించిందంటే ఇక ఆ భామకు మెగాహీరోల నుండి వరుస ఆఫర్లు రావడం ఖాయమని, ఆమె నక్కతోక తొక్కిందని, ఇక ఆమె దశ తిరిగినట్లేనని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. వరుణ్‌తేజ్‌తో ఆమె చేయబోయే చిత్రం ఒక్కటి కనుక మంచి హిట్‌ అయితే నిజంగానే ఈ కుమారి అదృష్టం ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ