వరుసగా హ్యాట్రిక్ చిత్రాలతో 50కోట్ల రేంజ్‌ను అందుకున్న స్టార్ అల్లుఅర్జున్. ప్రస్తుతం ఆయన అల్లుఅరవింద్ నిర్మాతగా గీతాఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ఆడియో ఏప్రిల్ 1న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదలకానుంది. మరోవైపు ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రానికి భారీ అంచనాలు వచ్చాయి. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్22న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ మాంచి ఊపులో జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కర్ణాటక రైట్స్‌ను ప్రముఖ టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమారు 7.5 కోట్లకు అమ్ముడుపోయిందని, అలాగే మలయాళ వెర్షన్ హక్కులను కూడా 2.5కోట్లకు దక్కించుకున్నారని సమాచారం. ఇదే కర్ణాటక ఏరియాలో పవన్ నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' రైట్స్ 9కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. పవన్‌తో పోటీ పడలేకపోయనా కూడా దాదాపు ఆయన చిత్రానికి దరిదాపుల్లో 'సరైనోడు' కూడా మంచి బిజినెస్ ఆఫర్లను అందుకుంటోందని, ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 60కోట్లకు పైగా జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఆడియో విడుదల తర్వాత, వైజాగ్‌లో జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగిన తర్వాత ఈ చిత్రం బిజినెస్ మరింత ఊపును అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.