Advertisementt

వెంకీ కంటే సునీల్‌తో ముందుగా..!

Fri 25th Mar 2016 02:09 PM
sunil,nenu sailaj,kishore tirumala,vankatesh  వెంకీ కంటే సునీల్‌తో ముందుగా..!
వెంకీ కంటే సునీల్‌తో ముందుగా..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌ మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఎలాంటి హడావుడి లేకుండా స్పీడ్‌గా సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని జూన్‌1న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత వెంకీ 'నేను...శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమలతో ఓ చిత్రం చేయనున్నాడు. అంతేకాదు... ఆయన పలు రీమేక్‌ చిత్రాలకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాడు. దీంతో ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌గా 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలతో పేరుతెచ్చుకున్న క్రాంతిమాధవ్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి కూడా వెంకీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటికే 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' చిత్రం తర్వాత క్రాంతిమాధవ్‌కు చాలా గ్యాప్‌ వచ్చింది. మరలా వెంకీ సినిమా కోసం ఎదురుచూడాలంటే మరింత కాలం వృథా అవుతుంది. దీంతో వెంకీ చిత్రం చేసేలోపు ఆయన సునీల్‌ హీరోగా పరుచూరి ప్రసాద్‌ నిర్మాణ సారధ్యంలో పరుచూరి కిరిటీ యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది కూడా ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడని సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ