Advertisementt

మన్మథుడి వేరియేషన్స్‌..!

Fri 25th Mar 2016 01:56 PM
nagarjuna,different roles,soggade chinni nayana,oopiri  మన్మథుడి వేరియేషన్స్‌..!
మన్మథుడి వేరియేషన్స్‌..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ స్టార్ట్‌ అయిన 30ఏళ్ల తర్వాత కూడా మన్మథుడు నాగార్జున ఎంతో గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ తన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ల కంటే తండ్రి నాగార్జునే ఎంతో గ్లామర్‌గా కనిపిస్తున్నాడనేది అందరు నోటిలోంచి వస్తున్న మాట. తన సినిమా సినిమాకు ఆయన తన విలక్షణత చూపిస్తున్నాడు. 'మనం' చిత్రంలో ఎంతో క్లాస్‌గా కనిపించిన ఈయన రేపు రానున్న 'ఊపిరి' చిత్రంలో కూడ కాస్త బరువు పెరిగి క్లాస్‌లుక్‌తో అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌లో ఆయన ఊరమాస్‌గా కనిపించి కవ్వించాడు.ఇక త్వరలో ఆయన చేయబోయే హతీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకేండ్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న 'నమో వేంకటేశాయ' చిత్రం కోసం బరువు తగ్గి, గడ్డం పెంచి వేంకటేశ్వ స్వామి భక్తునిగా మరోసారి 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి' వంటి గెటప్‌తో కనిపించనున్నాడు. ఇక 'సోగాడ్డే చిన్నినాయనా'కు సీక్వెల్‌గా రానున్న 'బంగార్రాజు' చిత్రంలో మరోసారి మాస్‌ లుక్‌తో అచ్చమైన తెలుగు దసరాబుల్లోడిగా దర్శనమివ్వనున్నాడు. ఇలా తన చిత్రాలలో పలు వేరియేషన్స్‌ చూపించడం కోసం ఆయన ఎంతగానో తపన పడుతున్నాడు. కాగా రేపు విడుదలకు సిద్దమవుతోన్న 'ఊపిరి' చిత్రంలో నాగ్‌ వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమయ్యే పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 60కోట్ల బడ్జెట్‌తో పివిపి సంస్ధ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈచిత్రంలో నాగ్‌ వాడిన వీల్‌చైర్‌కు సంబంధించిన ఓ హాట్‌ న్యూస్‌ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశం అయింది. ఈ వీల్‌చైర్‌ ఖరీదు ఏకంగా 25లక్షలు అని సమాచారం. పివిపి సంస్ద ప్రత్యేకంగా ఈ కుర్చీని మరీ స్పెషల్‌గా స్వీడన్‌లో ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారుచేయించారట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ