Advertisementt

ఇది పవన్‌ స్టైల్‌..!

Fri 25th Mar 2016 01:49 PM
pawan kalyan,sardhar gabbar singh,jhoney movie  ఇది పవన్‌ స్టైల్‌..!
ఇది పవన్‌ స్టైల్‌..!
Advertisement
Ads by CJ

ఒక్కో సినిమా స్క్రీన్‌ప్లే ఒక్కోవిధంగా ఉంటుంది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' స్క్రీన్‌ప్లే కూడా పవనే స్పెషల్‌గా డిజైన్‌ చేసుకున్నాడు 'జానీ' చిత్రం తర్వాత పవన్‌ చాలా గ్యాప్‌ తీసుకొని ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రం గురించిన ఓ వార్త ఇప్పుడు అన్నిచోట్లా హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్‌ సినిమా ప్రారంభమైన మొదటి 20నిమిషాలు కనిపించడు. అప్పటివరకు విలన్‌, రతన్‌పూర్‌ సెటప్‌, అక్కడి ప్రజలు పడే కష్టాలు, హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ వంటివి సాగుతాయట. సరైన టైమ్‌లో పవన్‌ ఎంట్రీ ఇచ్చి ఓ పదినిమిషాలు అదరగొట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫస్టాఫ్‌ పూర్తి పంచ్‌ డైలాగులతో, సెకండాఫ్‌ పూర్తిగా ఫన్‌ మిక్స్‌డ్‌ యాక్షన్‌తో సాగుతుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పటినుండే పవన్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రం విషయంలో రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది. ఈ చిత్రం కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్‌ బేస్‌డ్‌గా ఈ చిత్రం అదరగొట్టనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే కూడా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ