'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కళ్యాణ్, 'పండగ చేస్కో' సినిమాలో రామ్, 'కృష్ణాష్టమి' సినిమాలో సునీల్ ఎన్నారై పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ లిస్టులోకి మరో హీరో చేరాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరో గా నటిస్తున్న చిత్రం 'అ..ఆ'. ఈ చిత్రం లో నితిన్ ఎన్నారై పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రం లో స్టైలిష్ లుక్ లో కనిపించేందుకు నితిన్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా , నితిన్ ఈ చిత్రం లో చాలా భాధ్యతలను మోసే హీరోలా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మే లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.