Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్‌..!

Thu 24th Mar 2016 05:13 PM
pawan kalyan,sardhar gabbar singh,devisriprasad  పవన్‌ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్‌..!
పవన్‌ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్‌..!
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదల చేసిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' ట్రైలర్‌ విషయంలో ఆయన అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. ఈ చిత్రంలో నవరసాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ట్రైలర్‌లో మాత్రం పవన్‌ పంచ్‌ పవర్‌ మిస్సయిందని అందరూ వాపోతున్నారు. ఈ ఫీడ్‌బ్యాక్‌ పవన్‌ వరకు వెళ్లిందట. అందుకే శుక్రవారం ఈచిత్రం మరో ట్రైలర్‌ను పవన్‌ పంచ్‌ డైలాగ్స్‌తో విడుదల చేయడానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తున్నప్పటికీ ఇందులోని ఓ పాట విషయంలో మాత్రం చర్చ నడుస్తోంది. ఈ ఆల్బమ్‌లోని 'తోబా..తోబా' అనే సాంగ్‌ను ఓ కాపీ పాటగా చెబుతున్నారు. బాలీవుడ్‌ నుండి ఈ బీట్‌ను దేవిశ్రీ కాపీ కొట్టాడనే ప్రచారం జరుగుతోంది. అమితాబ్‌ బచ్చన్‌ నటించిన 'లావరీష్‌' లో ఇడే బీట్‌తో ఓ పాట ఉందని, అంతే కాదు. ఆ తర్వాత అదే బీట్‌ను షారుఖ్‌ ఖాన్‌ తన 'మైహునా' చిత్రంలో వాడేశాడని అంటున్నారు. మరి దేవిశ్రీ ఆ బీట్‌ నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యాడా? లేక నిజంగానే కాపీ కొట్టాడా? అనేది తెలియాలంటే ఈ విషయంపై దేవిశ్రీ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు. కానీ పాట విన్నవారు మాత్రం ఇది కాపీయే అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ