పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను ఏప్రిల్ 8వ తేదీన తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఎన్నడూ లేని విధంగా ఆయన పలువురు బాలీవుడ్ ఫిల్మ్ రిపోర్టర్స్‌ను పిలిచి మరీ ఇంటర్య్యూలు ఇస్తున్నాడు. ఇప్పటికే అనుపమచోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ తాజాగా మరో హిందీ విలేకరి అజయ్ బ్రహ్మూెత్మజ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ తెలుగు, హిందీ. ఇంగ్లీష్ వంటి మూడు భాషల్లో తను సంతకం చేసిన ఆటోగ్రాఫ్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఆల్‌రెడీ ఇప్పటికే 'జాగరన్ న్యూస్' లో ప్రచురితమైంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు ప్రమోషన్ విషయంలో పవన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎప్పుడు మీడియాకు దూంగా ఉండే పవన్ ఈసారి మాత్రం బాలీవుడ్ మీడియాకు అడిగి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, మరి తెలుగులో కూడా ఉన్న అన్ని టివి చానెల్స్, ప్రింట్ మీడియాకు కూడా ఆదే ప్రాధాన్యం ఇస్తాడా? లేక మూకుమ్మడిగా అందరికీ కలిపి ఒకే ఇంటర్వ్యూను ఇచ్చి అందరికీ అదే అంటాడో వేచిచూడాలి. కొందరు విమర్శకులు మాత్రం పవన్ తెలుగులో తన చిత్రానికి పెద్దగా ప్రమోషన్ అవసరం లేదనే భావనలో ఉన్నాడని అంటున్నారు. కాగా ఇటీవల ఈ చిత్రం సెట్స్‌లో పవన్ షకలక శంకర్‌ను కొట్టినట్లు వార్తలు వచ్చి సంచలనం సృష్టించాయి. కానీ షకలక శంకర్ కొన్ని రోజుల తర్వాత వాటిని కండిస్తూ తనకు పవన్ దేవుడితో సమానం అని స్టేట్‌మంట్ ఇచ్చాడు. కాగా ఈచిత్రం ఆడియో ఫంక్షన్‌లో షకలక శంకర్ కనిపించలేదు. కావాలని మీడియాకు, కెమెరాలకు దూరంగా ఉన్నాడా? లేక ఆడియో ఫంక్షన్‌కు అసలు రాలేదా? అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతోంది. కొందరు మాత్రం పవన్ షకలక శంకర్‌ను షూటింగ్‌కు, ఆడియో ఫంక్షన్‌కు దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆయన ఎవ్వరికీ కనిపించలేదంటున్నారు. కాగా ఆడియో ఫంక్షన్‌కు ముందు ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ని మీడియావారు ఈ ప్రశ్న అడుగుదామని ప్రిపేర్ అయినప్పటికీ ఆ సమయంలో పవన్‌ని అడిగే ధైర్యం చేయలేకపోయారని తెలుస్తోంది. అంతేకాదు.. షకలక శంకర్‌ను అడిగినట్లుగా పవన్‌ని ఏది పడితే అది. ఎక్కడ పడితే అక్కడ అడగలేరు కదా? ఇదే తెలుగు ఫిల్మ్ జర్నలిజం 'గొప్పతనం' అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.