Advertisementt

'అన్నయ్య'కోసం సునీల్‌ త్యాగం..!

Thu 24th Mar 2016 04:24 PM
chiranjeevi,sunil,katthi remake,vinayak  'అన్నయ్య'కోసం సునీల్‌ త్యాగం..!
'అన్నయ్య'కోసం సునీల్‌ త్యాగం..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి అంటే సునీల్‌కు మొదటి నుంచి చాలా ఇష్టం. ఆయన కమెడియన్‌గా ఉన్నప్పుడు చిరుతో కలిసి కొన్ని సినిమాలు చేశాడు. హీరోగా మారిన తర్వాత కూడా చిరుని కొన్ని సినిమాల్లో అనుకరించాడు. ఆయన డ్యాన్స్‌ మూమెంట్స్‌ను ఈజీగా చేయగలడు సునీల్‌. ఆయన హీరోగా కెరీర్‌ మొదలెట్టిన తర్వాత గమనిస్తే ఆయన పాటల్లో చిరును అనుకరిస్తూ స్టెప్స్‌ వేయడం, ఆయనలా హెయిర్‌స్లైల్‌ నుంచి డ్రస్‌ సెన్స్‌ దాకా మెయిన్‌టెయిన్‌ చేయడం గమనించవచ్చు. అలాంటి అన్నయ్య కోసం ఇప్పుడు సునీల్‌ ఓ త్యాగం చేయబోతున్నట్లు సమాచారం. హాస్యనటునిగా కెరీర్‌ మొదలెట్టిన సునీల్‌ స్టెప్‌ బై స్టెప్‌ ఎదిగి హీరోగా సెటిలయ్యాడు. ఇటువంటి సమయంలో ఎంతమంది తమ సినిమాల్లో కమెడియన్‌గా చేయమని బతిమాలినా కూడా ఆయన రిజెక్ట్‌ చేస్తూ వస్తున్నాడు. కానీ తాజాగా చిరంజీవి సునీల్‌ను పిలిపించి అడగటంతో ఆయన నటిస్తున్న 'కత్తి' రీమేక్‌లో ఓ కమెడియన్‌ పాత్రను చేయడానికి సునీల్‌ ఒప్పుకున్నాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. చిరు, వినాయక్‌లు ఇప్పటికీ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయకపోయినా తెర వెనుక పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. 

వాస్తవానికి తమిళ 'కత్తి' చిత్రం చాలా సీరియస్‌ సబ్జెక్ట్‌. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్దగా అవకాశం లేదు. కానీ ప్రస్తుతం మన ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. దాంతో 'కత్తి' తెలుగు రీమేక్‌లో బాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా వినాయక్‌ స్క్రిప్ట్‌లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు, అందుకోసం వినాయక్‌తో పాటు సీనియర్‌ రచయితలు పరుచూరి బ్రదర్స్‌ కూడా దీనిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చిరు రీసెంట్‌గా సునీల్‌ను పిలిచి మాట్లాడాడని సమాచారం. తమ కాంబినేషన్‌లో వచ్చిన 'అందరివాడు, జై చిరంజీవ' చిత్రాల కామెడీని గుర్తు చేసి మరోసారి అలాంటి ఫన్‌ను తెరపై పండిద్దామని సునీల్‌ను అడిగినట్టు, దాంతో సునీల్‌ కూడా మరో మాట మాట్లాడకుండా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే, మనం ఎంతగానో ఎంజాయ్‌ చేసిన సునీల్‌ కామెడీని మరలా ఎంచక్కా ఎంజాయ్‌ చేయవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చిరుతో కలిసి సునీల్‌ చేసిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నటించబోయే హీరోయిన్‌ విషయంలో కూడా పలు డిస్కషన్స్‌ చేస్తున్నారు. చివరకు నయనతార, అనుష్కల వద్ద ఆగారు. కానీ వినాయక్‌ మాత్రం తనకు కలిసి వచ్చిన నయనతారకు ఓటేస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో నటించడానికి ఈ భామ ఏకంగా 4కోట్లు డిమాండ్‌ చేస్తుండటంతో అనుష్క లైన్‌లోకి వచ్చిందని సమాచారం. అనుష్క గతంలో చిరు నటించిన 'స్టాలిన్‌'లో ఓ పాటలో చిరు సరసన చిందులేసిన సంగతి తెలిసిందే. దీంతో హీరోయిన్‌ విషయంలో ఫైనల్‌ డెసిషన్‌ను చిరుకే అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ