Advertisementt

'బిగ్‌బాస్‌' అదరగొడుతున్నాడు..!

Wed 23rd Mar 2016 07:19 PM
chiranjeevi,new look,sardhar gabbar singh,katthi  'బిగ్‌బాస్‌' అదరగొడుతున్నాడు..!
'బిగ్‌బాస్‌' అదరగొడుతున్నాడు..!
Advertisement
Ads by CJ

సినిమాలలోకి తిరిగి రావాలని డిసైడ్‌ అయిన తన్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఫిజిక్‌పై దృష్టి పెట్టాడని స్పష్టంగా అర్ధమవుతోంది. ఆయన సినీ కెరీర్‌లో ఉన్నంతకాలం ఆయన ఫిజిక్‌పై ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బాగా లావైపోయి ఆయన గ్లామర్‌ మొత్తం పోయింది. అందుకే ఆయన 'కత్తి' రీమేక్‌లో నటించాలని డిసైడ్‌ అయిన తర్వాత తన ఫిజిక్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టాడు. ఆ విషయం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' ఆడియో వేడుకలో స్పష్టమైంది. ఇప్పటికే ఆయన కోరమీసం పెంచిన ఓ లుక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇది 'కత్తి' చిత్రంలోని నాయకుడి పాత్రకు అనేది స్పష్టమైంది. తాజాగా ఆయన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' ఆడియోకు రఫ్‌లుక్‌తో వచ్చాడు. ఒకప్పటి 'గ్యాంగ్‌లీడర్‌, బిగ్‌బాస్‌' చిత్రాలలోని చిరులా ఆయన కనిపించారు. ఇది 'కత్తి' చిత్రంలోని దొంగ పాత్ర గెటప్‌ అని అందరూ భావిస్తున్నారు. ఈ గెటప్‌ను చూసి ఆయన అభిమానులు 'అదిరింది గురూ' అంటూ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన పాటలు, స్టెప్స్‌ విషయంలో కూడా ఓ కొత్త డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆరుపదుల వయసులో కూడా తనకిష్టమైన సినిమాల కోసం చిరు ఎంత కష్టపడుతున్నాడో అర్థం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ