Advertisementt

సూపర్‌స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌..!

Wed 23rd Mar 2016 11:12 AM
super star rajinikanth,mahesh babu,brahmothsawam,kabali  సూపర్‌స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌..!
సూపర్‌స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు మహేష్‌బాబుకు పెద్ద చిక్కొచ్చిపడింది. తన తాజాచిత్రం 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని మే చివరివారంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రాన్ని మే 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా 'కబాలి' చిత్రం తెలుగులో కూడా భారీ ఎత్తున్న విడుదలకానుంది. అదే సమయంలో 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ భారీ ఎత్తున రిలీజ్‌ చేయనున్నారు. దీంతో అనుకోకుండా సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుల చిత్రాలు క్లాష్‌ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఈ పోటీ కొనసాగుతుందా? లేక ఎవరైనా వెనక్కి తగ్గుతారా? అనే విషయం ఆసక్తిని కలుగజేస్తోంది. రజనీ రావడం ఖాయమని, అయితేగియితే మహేషే వెనక్కుతగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ