అడవిశేషు, ఆదాశర్మ, అనసూయ ముఖ్యపాత్రల్లో నటించిన 'క్షణం' చిత్రం పివిపి సంస్థకు పెట్టుబడిని మించి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ రైట్స్‌ను సాజిద్ నడియావాలా కోటి 30లక్షలకు సొంతం చేసుకొని బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్‌లతో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈచిత్రం తమిళ రైట్స్‌ను ప్రముఖ నైజాం పంపిణీసంస్థ అభిషేక్ పిక్చర్స్ వారు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారట. మరి తమిళంలో ఏయే పాత్రలకు ఎవరిని తీసుకోవాలి? అనే పనిలో అభిషేక్ పిక్చర్స్ అధినేత బిజీగా ఉన్నాడంటున్నారు. మొత్తానికి చిన్న చిత్రంతో భారీ లాభాలను పివిపి సంస్ధ వెనకేసుకుంది.