దిల్‌రాజుకు ఇటీవల నిర్మాతగా వరుస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సునీల్ హీరోగా వచ్చిన 'కృష్ణాష్టమి' కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఆయన మనసంతా మెగాహీరో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న 'సుప్రీం' మీదనే ఉంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ప్రకటించినా కూడా అది ఏప్రిల్ ఫూల్‌గానే మిగిలిపోయింది. ఎందుకొచ్చిన తంటా అనుకొన్న దిల్‌రాజు నింపాదిగా సోలోగా రావాలని డిసైడ్ అయ్యాడట. దీంతో ఈచిత్రం ఆడియోను కూడా ఇంతకాలం విడుదల చేయలేదు. తాజాగా 'సుప్రీం' ఆడియోను ఏప్రిల్ 10న విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటికి 'సర్దార్' రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఈ చిత్రానికి స్పెషల్ గెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ను పిలవాలని సాయిదరమ్‌తేజ్ చేత వవన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. పాపం..దిల్‌రాజుకు ఎన్ని కష్టాలు వచ్చాయో..!