పవన్ కళ్యాణ్, అ పేరుకు ఉండే క్రేజ్; ఆయన సినిమాలకు ఉండే మైలేజ్ మరే హీరోకి, మరే చిత్రాలకి ఉండదు అనేది అక్షర సత్యం. ఆయన ఫ్లాప్ ఇచ్చినా, సూపర్ డూపర్ హిట్టు తీసినా వెనువెంటనే పవన్ పెరుకోచ్చే నష్టమో, లాభమో మాత్రం ఏమీలేదు. ఎందుకంటే గెలుపు ఓటములను మించిన పేరు ప్రఖ్యాతలు, వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే పవన్ కళ్యాణ్ నుండి కొత్త సినిమా అనగానే యావత్ తెలుగు ప్రేక్షకలోకం మొత్తం తలెత్తి ఓసారి గమనిస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి కూడా అదే జరుగుతోంది. ఏప్రిల్ 8న వస్తుందో రాదో తెలీదుగానీ ఏ టైంలో వచ్చినా పవన్ కళ్యాణ్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం. ట్రైలర్ చూసిన పిదప ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చినా సినిమాకు బాక్సాఫీస్ దగ్గర డోఖా ఉండబోదు అన్నది వ్యాపార వర్గాల అంచనా. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి విజయాల సరసన సర్దార్ చేరుతాడా లేదా అన్నది కాలంతో పాటే మనమూ తెలుసుకోగలం గానీ ఖరాఖండీగా ఫస్ట్ డే, సెకండ్ డే వసూళ్ళలో సర్దార్ అన్ని రికార్డులని తుడిచి పెట్టేయడం తథ్యం. పైన పేర్కొన్న రెండు సినిమాలకు వచ్చినట్టుగా యునీక్ పాజిటివ్ టాక్ వస్తే ఇక ఒక్క వారం చాలు, బాహుబలిలు, శ్రీమంతుడులు వాష్ అవుట్ అయిపోతాయి అని ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. పవన్ కథ, కథనాలు అందించిన సర్దార్ గబ్బర్ సింగ్ మరి ఏ స్థాయి కనకవర్షం కురిపిస్తుంది వెయిట్ అండ్ సి!