మంచు మనోజ్ సినిమాలన్నా, రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నా జనాలు భయపడిపోతున్నారు. మరి విచిత్రంగా వీరిద్దరి కలయికలో ఎప్పటి నుండో ఆసక్తి రేకెత్తిస్తున్న అటాక్ అనే చిత్రం ఇప్పుడు ఆడియెన్సు మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతోంది. ముందుగా ట్రైలర్ చూసినప్పటి నుండీ ఈ అటాక్ మీద కాసిన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ వంటి భారీ తారాగణంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. అందునా వర్మకు ఇష్టమైన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కావడంతో తెర మీద అటాక్ అప్పీలింగుగా అనిపించింది. దురదృష్టం కొద్దీ నిర్మాతల చేసిన జాప్యంతో సినిమా ప్రింటులు ల్యాబుల్లోనే మగ్గాయి. ఎలాగో మంచు మనోజ్ చేసిన శౌర్య బాక్సాఫీస్ దగ్గర కుప్ప కూలింది కాబట్టి కొద్ది వారాలు గ్యాప్ తీసుకొని అటాక్ విడుదల ప్లాన్ చేద్దామనుకున్న నిర్మాతలకు వేసవి పెద్ద చిత్రాలు ఆ వీలు కల్పించలేదు. అందుకే ఏప్రిల్ 1న అటాక్ చేయబోతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. రక్త చరిత్ర తరువాత వర్మ నుండి గొప్ప మూవీ రాలేదని ఫీలవుతున్న సినిమా లవర్సులి ఇది కొత్త అనుభూతినిస్తుంది అంటున్నారు. ఈ అటాక్ అయినా సక్సెస్ కావాలని కోరుకుందాం!