Advertisementt

'24' ఆడియో వేడుకకు రంగం సిద్దం!

Sun 20th Mar 2016 05:37 PM
surya,24 movie,vikram k kumar,trivikram srinivas  '24' ఆడియో వేడుకకు రంగం సిద్దం!
'24' ఆడియో వేడుకకు రంగం సిద్దం!
Advertisement
Ads by CJ

తమిళస్టార్‌ సూర్య మూడు విభిన్న గెటప్‌లలో నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ '24'. ఈ చిత్రానికి 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఫొటోస్‌, టీజర్స్‌ అందరిలో ఆసక్తిని పెంచాయి. కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరగుతున్నాయి. కాగా ఈచిత్రం ఆడియో వేడుకను ఈనెల 28న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం తెలుగు ఆడియోతో పాటు తమిళ ఆడియోను కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ వేడుకకు పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. నేను కూడా మీ వాడినే అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసమే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగులో మాటల మాంత్రికునిగా పేరున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్‌ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణ తెలుగులో నిర్మిస్తుండగా, తమిళంలో ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బేనర్‌ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించనున్నాడు. కాగా ఈ చిత్రం బడ్జెట్‌ 100కోట్లు అని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ