Advertisementt

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భలే జోరుమీదున్నాడు!

Sun 20th Mar 2016 02:25 PM
senior hero naresh,second innings brahmothsawam,a aa movie  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భలే జోరుమీదున్నాడు!
సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భలే జోరుమీదున్నాడు!
Advertisement
Ads by CJ

80వ దశకంలో హీరోగా, మరీ ముఖ్యంగా కామెడీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు సీనియర్‌ నరేష్‌. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌లతో పాటు సీనియర్‌ నరేష్‌ కూడా కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలం తెరమరుగయ్యాడు. ఇప్పటికీ నరేష్‌ నటించిన 'నాలుగు స్థంబాలాట. చిత్రం భళారే విచిత్రం' చిత్రాలను ఎవ్వరూ మర్చిపోరు. ముఖ్యంగా 'చిత్రం భళారే విచిత్రం'లో ఆయన వేసిన లేడీ గెటప్‌, అందులో ఆయన పండించిన కామెడీ ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. తాజాగా ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో కూడా ఆయన వరుస చిత్రాలు చేస్తూ దూకుడు మీదున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'చందమామ కథలు, దృశ్యం, భలే భలే మగాడివోయ్‌' చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా విడుదలైన 'గుంటూరు టాకీస్‌' ఆయన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అ..ఆ', మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం', సూపర్‌స్టార్‌ కృష్ణ రీఎంట్రీ ఇస్తున్న 'శ్రీశ్రీ' వంటి చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు చేస్తున్నాడు. మొత్తానికి సీనియర్‌ నరేష్‌ కెరీర్‌ ఇప్పుడు మంచి ఊపుమీదుందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ