శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా అక్షయ్‌కుమార్ విలన్‌గా, అమీజాక్సన్ హీరోయిన్‌గా దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం 'రోబో2.0'. కాగా ఈచిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోపై కూడా ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆడియోను లండన్‌లో విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. లండన్‌లో ఆడియోవేడును ఘనంగా నిర్వహించడానికి కారణం లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన హెడ్ ఆఫీస్ లండన్‌లోనే ఉందని సమాచారం. అయితే తనను విపరీతంగా అభిమానించే తన అభిమానులు ఇలా చేస్తే బాగా బాధపడతారని రజనీ భావిస్తున్నాడట. మొత్తానికి ఈ చిత్రం ఆడియో వేడుకను ఎక్కడ నిర్వహించాలో టీమ్ మొత్తం కలిసి త్వరలో తుది నిర్ణయానికి రానున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలోని ఫిరోజ్‌షాకోట్లా మైదానంలో వేసిన అతి పెద్ద సెట్‌లో జరుపుకుంటోంది.