Advertisementt

చైతూ భలే స్కెచ్‌ వేస్తున్నాడు!

Sat 19th Mar 2016 01:11 PM
naga chaitanya,ye maya chesave,sahasam swasaga sagipo  చైతూ భలే స్కెచ్‌ వేస్తున్నాడు!
చైతూ భలే స్కెచ్‌ వేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

టాలెంటెడ్‌ దర్శకులను పట్టుకోవడంలో చైతూ అందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు. అంతేకాదు..సామాన్యంగా ఓ చిత్రానికి టైటిల్‌ పెట్టడం కోసం హీరోలు, దర్శకనిర్మాతలు తలలు బద్దలుకొట్టుకుంటూ ఉంటారు. కానీ చైతూ మంచి హిట్‌ పాటలలోని పదాలతో తన సినిమాలకు టైటిల్స్‌ పెట్టేసి ఈజీగా క్యాచీ టైటిల్స్‌ను పట్టేస్తున్నాడు. తన మొదటి హిట్‌ 'ఏ మాయచేసావే' కూడా 'ఒక్కడు' చిత్రంలోని 'నువ్వే మాయ చేసావోగానీ...' అనే పాట నుండి తీసుకున్నదే. ఆ తర్వాత ఆయన తన తాత నటించిన 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రంలోని 'ఒక లైలా కోసం..'ను టైటిల్‌గా మార్చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌తో ఆయన చేస్తోన్న 'సాహసం శ్వాసగా సాగిపో' కూడ 'ఒక్కడు' పాటలోనిదే. తాజాగా ఆయన రమేష్‌వర్మతో ఓ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యాడు. ఈ చిత్రంలో చైతూ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌, పూజాహెగ్డేలు నటించనున్నారు. ఈ చిత్రానికి కూడా 'ఇదేదో బాగుందే చెలి' అనే టైటిల్‌ను పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ