పవన్ ఏదీ తొందరగా ఫిక్స్‌కాడు. అయ్యాడంటే ఇక దానికి తిరుగేవుండదు. తన తాజా చిత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్'ను ఎలాగైనా ఏప్రిల్ 8న విడుదల చేయడానికి ఆయన రేయింబవళ్లు పని చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్‌పై రామోజీ ఫిలింసిటీలో ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. మార్చి 20న ఆడియోవేడుక జరుపనున్నారు. అ పక్క రోజే యూనిట్ స్విట్జర్లాండ్‌కు చేరుకొని వారంరోజుల్లో మూడు పాటలను చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుందని, షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా వేగంగా జరుగుతోందని సమాచారం. కాగా ఈచిత్రం ఆడియో వేడుకను మొదట గచ్చిబౌలి స్టేడియంలో జరపాలని, ఆ తర్వాత నిజాం గ్రౌండ్స్‌లో జరపాలని ప్రయత్నించారు. కానీ వీటికి పర్మిషన్ దొరక్కపోవడంతో తన 'జనసేన' పార్టీని స్థాపించిన నోవాటెల్ హోటల్‌లోని అదే ప్రదేశంలో జరపడానికి రెడీ అవుతున్నారట. అయితే ఇక్కడ ఆడియో వేడుక జరిగితే అభిమానులకు కొంత నిరాశ తప్పదు. అందరికీ ఈ హోటల్‌లో ప్రవేశం లభించదు. లిమిటెడ్ అభిమానులకు మాత్రమే పాస్‌లు లభిస్తాయి. కాగా ఈ ఆడియోవేడుకలో పవన్ తన అభిమానుల్లో 1000మందిని సెలక్ట్ చేసి వారికి ప్రత్యేక గిఫ్ట్‌లను అందజేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత శరత్‌మరార్ గోప్యంగా ఉంచుతున్నాడట. కానీ గిఫ్ట్‌లుగా టీషర్ట్స్‌ను లేదా మెమోంటోలను అందజేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా ఈ చిత్రంలో కాజల్ తొలిసారిగా పవన్ సరసన నటిస్తోంది. ఇందులో ఆమె రతన్‌పూర్ యువరాణిగా కనిపించనుందన సమాచారం. అమెపై వచ్చే కీలకసన్నివేశాలను ఓ ప్యాలెస్‌లో చిత్రీకరించారని సమాచారం. 'మగధీర' తర్వాత మరలా కాజల్ ఈ చిత్రంలో యువరాణిగా నటిస్తుండటంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. మొత్తానికి ఈ చిత్రానికి పవన్ కేవలం హీరోనే కాదు... ఓ నిర్మాత, కథకుడు కూడా కావడంతో ఈ చిత్రంపై అందరిలో మంచి ఆసక్తి నెలకొనివుంది.