Advertisementt

గ్యాంగ్‌స్టర్‌గా రానా...!

Fri 18th Mar 2016 03:39 PM
rana,villain role,dhanush,gautham menon,bahubali  గ్యాంగ్‌స్టర్‌గా రానా...!
గ్యాంగ్‌స్టర్‌గా రానా...!
Advertisement
Ads by CJ

ఇటీవల తమిళంలో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా లవ్‌ మూవీస్‌నే కాదు... యాక్షన్‌ మూవీస్‌ను కూడా తనదైనశైలిలో చిత్రీకరించే దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నాడు. ఇందులో ధనుష్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండగా, ఆయనకు పోటీగా మరో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న విలన్‌ పాత్రకు దగ్గుబాటి రానాను ఎంపిక చేసుకున్నాడు. ఇందులో రానా కూడా ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడని సమాచారం. మొత్తంగా చూస్తే రానాకు సోలోహీరోగా పెద్దగా అవకాశాలు రాకపోయినా ఇలాంటి పాత్రలు మాత్రం ఆయన్ను వెత్తుకుంటూ వస్తున్నాయి. 'బాహుబలి'తో ఈ ఊపు మరింత ఎక్కువైంది. కాగా ఇప్పుడు రానా మనసంతా తాను నటిస్తున్న 'ఘాజీ' చిత్రంపైనే ఉన్నాయి. ఇందులో ఆయన సోలోహీరోగా నటిస్తుండటంతో ఈచిత్రంతో తనకి సోలోహీరోగా మంచి బ్రేక్‌ వస్తుందనే ఆశతో రానా ఉన్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ