పవన కళ్యాణ్ అన్న పేరు వింటే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు అభిమానులు. సర్దార్ గబ్బర్ సింగ్ రోజుకో సర్ప్రైజ్ అన్నట్లుగా మొన్న ఫస్ట్ లుక్కుతో, నిన్న మేకింగ్ వీడియోతో, ఈరోజు ఫస్ట్ సాంగ్ టీజరుతో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ రోజే బయటకొచ్చిన టైటిల్ సాంగ్ టీజర్ అద్దిరిపోయింది అనేట్టుగా ఉంది. గబ్బర్ సింగ్ కాస్తా సర్దార్ గబ్బర్ సింగ్ పేరుతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు, ఇక ఆల్ బ్యాడ్ గైస్ ఖబర్దార్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ గొంతులో ప్రాణం పోసుకున్న ఈ పాటను దర్శకుడు బాబీ, హీరో పవన్ కళ్యాణ్ చాలా అందంగా తెరకెక్కించారు. తనదైన సాదా సీదా మేనరిజమ్స్, చిలిపి వేషాలతో పవన్ పోలీస్ టీం అదేనండీ మొత్తం జబర్దస్త్ కమెడియన్స్ ఈ టీజర్లో సందడి చేసారు. అచ్చు గుద్దినట్టు గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ట్యూనులోనే ఈ పాటను కూడా స్వరపరిచిన దేవి, తన టిపికల్ స్టైల్ అనుసరించి ఎనర్జీని వెదజల్లాడు. ఓ పవన్ కళ్యాణ్ సినిమా నుండి మనం ఏవైతే ఆశిస్తామో, అవన్నీ జాగ్రత్తగా పేర్చినట్టు కన్పిస్తున్న ఈ టీజర్ నిజంగా ఫ్యాన్సుకి కనువిందు. మొత్తం పాట వినాలనిపిస్తే మరో రెండు రోజులు ఆగాల్సిందే, ఎందుకంటే 20న సర్దార్ పాటల పండగ రాబోతోంది!