రెబెల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడుకి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు ప్రభాస్ అయితే పెద్ద కొడుకు పేరు ప్రభోద్. అయితే ప్రభాస్ అన్న ప్రభోద్ కు ఊహించని షాక్ కలిగింది. చెక్ బౌన్స్ కేసులో ప్రభోద్ కు ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ప్రభోద్ 43 లక్షల చెక్ ఇచ్చాడు. అది కాస్త బౌన్స్ అవ్వడంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజేంద్ర నగర్ కోర్టు యేడాది జైలు శిక్షని విధిస్తూ తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు 80 లక్షల జరిమానా విధించింది. రెండు నెలల వ్యవధిలో జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్షను పెంచే అవకాశాలున్నాయి. 'బాహుబలి' సినిమాతో ఇంటర్నేషనల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇలాటి తరుణంలో ప్రభాస్ అన్నకు ఇలా జరగడంతో హాట్ టాపిక్ గా మారింది.