Advertisementt

వరస చిత్రాలతో నేచురల్‌స్టార్‌ బిజీ..!

Wed 16th Mar 2016 12:45 PM
nani,bahle bahle magadivoy,bhale manchi roju,sriram adithya  వరస చిత్రాలతో నేచురల్‌స్టార్‌ బిజీ..!
వరస చిత్రాలతో నేచురల్‌స్టార్‌ బిజీ..!
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్‌' అనే ఒక్క చిత్రం నాని కెరీర్‌ను మార్చేసింది. ఆ స్దాయిలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో నాని రాత్రి రాత్రి నేచురల్‌ స్టార్‌గా మారిపోయాడు. కాగా ప్రస్తుతం ఆయన తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. దాని తర్వాత 'ఉయ్యాలజంపాల' ఫేమ్‌ విరించి వర్మతో ఓ చిత్రం ఒప్పుకున్నాడు. తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. 'భలే మంచి రోజు' తో మంచి టాలెంట్‌ ఉన్న దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్ధ భవ్యక్రియేషన్స్‌ నిర్మించనుంది. తనకు వచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ బాగా నచ్చిన కథలనే నాని ఎంచుకుంటున్నాడని, తనకు ఎంతో నచ్చితే గానీ ఏ చిత్రానికి ఓకే చెప్పడం లేదని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. మరి నాని తన కెరీర్‌ గ్రాఫ్‌ను ఎలా పెంచుకుంటాడో? లేదో? చూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ