Advertisementt

బాహుబలికి ఎర్త్ పెడుతున్న సర్దార్?

Tue 15th Mar 2016 02:56 PM
pawan kalyan,sardaar gabbar singh,baahubali,srimanthudu  బాహుబలికి ఎర్త్ పెడుతున్న సర్దార్?
బాహుబలికి ఎర్త్ పెడుతున్న సర్దార్?
Advertisement
Ads by CJ

ఓ తెలుగు సినిమా యావత్ ప్రపంచంలో ఇంతటి గొప్ప రికార్డులను, అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుంది అన్నది కలలో కూడా మనం బాహుబలికి ముందు ఊహించి ఉండము. రాజమౌళి విజన్, ప్రభాస్ హీరోయిజం, రానా విలనిజం, కీరవాణి మ్యూజిక్ మెస్మరిజం, కళ్ళు మిరుమిట్లుగొలిపే గ్రాఫిక్స్ మాయాజాలం... ఇలా అన్నీ కలిపి బాహుబలిని ఎక్కడో కూర్చోబెడితే ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్  అన్న ఒక్క పేరుతో ఆ రికార్డులను తురిపేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి మొన్నటి వరకు కూడా సర్దార్ హిందీ వర్షన్ అనేది ఒకటి ఉండబోతుంది అన్న సంగతి మనకు తెలీదు. కానీ రావడమే హిందీ పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ బొమ్మేసి ఫ్యాన్సును పిచ్చెక్కించారు. సుమారుగా 800 ధియేటర్లలో నార్త్ ఇండియా మొత్తం హిందీ వర్షన్ విడుదలకు EROS  సంస్థ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎల్లుండి అంటే గురువారం రోజున సర్దార్ హిందీ ట్రైలర్ కూడా మార్కేట్టు లోనికి వదలబోతున్నారు. అన్నీ కలిసొస్తే సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దెబ్బ ఏకంగా బాహుబలిని కదిలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోనీ హీనదశలో సెకండ్ పొజిషన్లో ఉన్న శ్రీమంతుడుకు అయితే స్థాన చలనం ఖాయం. ఎన్నో రోజులు లేదులెండి, ఏప్రిల్ 8రానే వచ్చేస్తోంది! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ