ఇప్పటిదాకా సర్దార్ గబ్బర్ సింగ్ అనే పవన్ కళ్యాణ్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన ప్రజానీకమే చూస్తారనుకున్నాం. మహా అయితే కేరళ, తమిళనాడు, కర్నాటక వరకు పవన్ మ్యానియా పాకుద్ది అనుకోని ఉంటాం. EROS వారు చిత్రానికి సంబంధించి సర్వహక్కులను నిర్మాత శరత్ మరార్ గారి నుండి కొనుగోలు చేసారు గనక ఇప్పుడు సర్దార్ హిందీ వర్షన్ కూడా నార్త్ ఇండియా మొత్తం ఊపేయనుంది. మరి హిందీ రిలీజ్ కూడా తెలుగుతో పాటే ఏప్రిల్ 8న ఉంటుందా లేదా అన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఇంతలో సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వర్షన్ కమింగ్ సూన్ అన్న పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ గుర్రం స్వారీ చేస్తున్న స్టైల్ చూసి ఫ్యాన్స్ కూడా అప్పుడే అంచనాల స్వారీని మరింత వేగవంతం చేసారు. రత్తన్ పూర్ పోలీస్ స్టేషన్లో, ఆ ఊరిలో ఉన్న సమస్యలను హీరో సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా తొలగించాడు అన్నదే క్షుణ్ణంగా సర్దార్ కథాంశం. రత్తన్ పూర్ ఆర్ట్ సెటప్ సాంతం ఒంటెలు, గుర్రాలతో నిండిపోయింది కాబట్టి నార్త్ ప్రేక్షకులకి నేటివిటీ పరంగా అతుక్కుపోయినట్టే. మిగిలిన హీరో, హీరోయిన్, విలన్, సహచర నటీనటవర్గం కనెక్ట్ అయితే సినిమాకు యావత్ దేశంలో తిరుగు ఉండకపోవచ్చు.