Advertisementt

ఎన్టీఆర్‌ సినిమాలో మరోసారి జగ్గు!

Mon 14th Mar 2016 12:52 PM
jagapthi babu,ntr,nannaku prematho,janatha garage  ఎన్టీఆర్‌ సినిమాలో మరోసారి జగ్గు!
ఎన్టీఆర్‌ సినిమాలో మరోసారి జగ్గు!
Advertisement

'నాన్నకు ప్రేమతో' చిత్ర విజయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాత్ర ఎంత ఉందో విలన్‌గా నటించిన జగపతిబాబు పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఉంది. క్లాస్‌ విలన్‌గా ఆయన నటన అద్భుతం అని ప్రశంసలు అందుకున్నాడు. కాగా ఎన్టీఆర్‌ త్వరలో నటించనున్న మరో చిత్రంలో కూడా జగపతిబాబు మరోసారి కీలకపాత్రను పోషించనున్నాడు. నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబును దృష్టిలో పెట్టుకొని ఓ పవర్‌ఫుల్‌ పాత్రను వక్కంతం వంశీ సృష్టించాడని సమాచారం. బహుశా ఈ చిత్రం ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'జనతాగ్యారేజ్' సినిమా పూర్తయిన తర్వాత ప్రారంభంకానుందని సమాచారం. కాగా జగపతిబాబు తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. త్వరలో ఆయన ఓ మలయాళ చిత్రంలో సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించనున్న చిత్రంలో తొలిసారిగా ఓ పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే రజనీకాంత్‌ నటించిన 'లింగా' చిత్రంలో నటించిన జగపతిబాబుకు ఇప్పుడు తమళంలో మరో క్రేజీ ఆఫర్‌ వచ్చిందని సమాచారం. విజయ్‌ హీరోగా నటించనున్న 60వ చిత్రంలో జగపతిబాబు ప్రధాన విలన్‌ పాత్రను పోషించనున్నాడట. మొత్తానికి కొన్ని కొన్ని జీవితాలు ఒకే ఒక్క నిర్ణయంతో పూర్తిగా మారిపోతాయన్నది జగపతిబాబును చూస్తే అర్థం అవుతుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement