Advertisementt

అందుకే అందరూ తాపీగా ఉన్నారు!

Mon 14th Mar 2016 09:47 AM
nagarjuna,maldives,akhil,naga chaitanya,amala  అందుకే అందరూ తాపీగా ఉన్నారు!
అందుకే అందరూ తాపీగా ఉన్నారు!
Advertisement
Ads by CJ

అఖిల్ చిత్రం అడ్డంగా దెబ్బేసినా, అక్కినేని వారి సత్తాని అత్యద్భుతంగా చాటిన చిత్రంగా సోగ్గాడే చిన్ని నాయనా నిలిచిపోయింది. మొదటిసారిగా 50 కోట్ల క్లబ్బు కూడా నాగార్జున ముందు తలొంచింది. అందుకే మరోసారి తన విశిష్టతను చూపెట్టే ప్రయత్నంగా ఊపిరితో తొందరలోనే మన ముందుకు రానున్నాడు. మరోవైపు నాగార్జున పెద్దబ్బాయి నాగ చైతన్య కూడా సాహసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్ లాంటి ప్రామిజింగ్ మూవీస్ వేసవికి లైన్లో పెట్టాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు పూర్తయింది. అంటే రానున్న వేసవి సెలవులకి అక్కినేని వారి నుండి మూడు గట్టి చిత్రాలు బరిలో ఉండబోతున్నాయి. కష్ట పడడం అయిపొయింది కనక ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా వేసవి మొదట్లోనే ఔటింగ్ వేసేస్తే ఎంత  బాగుంటుంది అనుకున్నారేమో నాగార్జున గారు. అనుకున్నదే తడువుగా మాల్దీవ్స్ దీవికి కుటుంబ సమేతంగా ట్రిప్ లాగించేసారు. ఇదిగో ఈ రోజు మార్నింగ్ అండర్ వాటర్ స్కూబా డైవింగ్ కూడా చేస్తున్న ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేసి అభిమానులను పలకరించారు. నాగ్, అమల, చైతు, అఖిల్.... అందరూ ఒక్క ఫోటోలో అదీ సముద్రం మధ్యలో ఉండడం భలే కిక్కు కదా! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ