'హార్ట్‌ఎటాక్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పూరీజగన్నాథ్ పరిచయం చేసిన భామ ఆదాశర్మ. ఇటీవలే ఆమె నటించిన 'క్షణం' చిత్రం మంచి సక్సెస్ అయింది. కాగా ఆమెకు ఇప్పుడు కోలీవుడ్ మన్మథుదు శింబు నుండి పిలుపొచ్చింది. ఆమధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ 'హసీ తో ఫసీ' సినిమాలో ఆదాశర్మ ఓ ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్‌ను చూసి మగ్దుడైన శింబు చూపు ఇప్పుడు ఆమెపై పడటంతో తన తాజా చిత్రం 'ఇదు నమ్మ ఆలు' చిత్రంలో ఓ ఐటం సాంగ్ కోసం ఆదాశర్మను తీసుకొని ఆమెతో చిందులేయనున్నాడు శింబు. ఆ అవకాశాన్ని ఆదాశర్మ కూడా ఓకే చేసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్ హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రావడం లేదని ఫీల్ అవుతోన్న ఆదాశర్మ సెకండ్ హీరోయిన్, ఐటం సాంగ్.. ఇలా ఏ పాత్రను చేయడానికైనా సిద్దమైపోతోంది. కేవలం మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాకపోయినా కనీసం ఇటువంటి అవకాశాలనైనా సద్వినియోగం చేసుకొని కాస్త వయసులో ఉన్నప్పుడే అవకాశాలు అందుకొని, ఆర్దికంగా స్థిర పడాలని ఆదాశర్మ భావిస్తోందిట.