Advertisementt

ఎన్టీఆర్‌కు కన్నడలో అంత పట్టు ఎలా వచ్చింది!

Sat 12th Mar 2016 08:07 PM
ntr,kannada song,chakra vyooha,puneeth raj kumar  ఎన్టీఆర్‌కు కన్నడలో అంత పట్టు ఎలా వచ్చింది!
ఎన్టీఆర్‌కు కన్నడలో అంత పట్టు ఎలా వచ్చింది!
Advertisement
Ads by CJ

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న 'చక్రవ్యూహ' చిత్రంలో కన్నడలో ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు కన్నడంతో పాటు తెలుగులో కూడా హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాడిన ఈ పాటను విన్నవారు ఎన్టీఆర్‌ కన్నడలో అంత స్వచ్చంగా, స్పష్టంగా ఎలా పాడాడా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ కన్నడలో అంత పట్టుతో ఆ పాట పాడటానికి కారణం ఎన్టీఆర్‌ వాళ్ల అమ్మే అంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లి షాలిని స్వతహాగా కర్ణాటక వాసి అని, ఆమె మాతృభాష కన్నడం కావడంతో ఎన్టీఆర్‌కు చిన్నపట్టి నుండి కన్నడ భాషపై మంచి పట్టు ఉండేదని, ఇంట్లో ఎన్టీఆర్‌ వాళ్ల అమ్మతో చిన్నపట్టి నుండి కన్నడలోనే మాట్లాడుతుంటాడని తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్‌కు కన్నడపై మంచి పట్టు ఉందని, అదే ఈ పాట అంత స్పష్టంగా ఎన్టీఆర్‌ అంత స్వచ్ఛంగా పాడటానికి దోహదపడిందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ