ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో అక్కినేని అభిమానులు తెగ హుషారుగా వున్నారు. ఇదే ఊపులో నాగార్జున తాజా చిత్రం ‘ఊపిరి’, నాగచైతన్య ‘ప్రేమమ్’లు కూడా విజయం సాధిస్తాయనే ధీమాతో వున్నారు అక్కినేని ఫ్యాన్స్. అంతేకాదు చైతూ తాజా చిత్రం ‘ప్రేమమ్’ బిజినెస్ హాట్‌కేక్‌లా..ఫినిష్ అయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తొలినుంచి ఈ చిత్రం విషయంలో అందరిలోనూ ఆసక్తి వున్న ఈ చిత్రం ఏరియా హక్కులను బయ్యర్స్ ఫ్యాన్సీ రేట్లతో సొంతం చేసుకున్నారట. దాదాపుగా 5 కోట్ల రూపాయాల ఫ్రాఫిట్‌తో 'ప్రేమమ్' బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ‘లవ్‌స్టోరీస్ ఎండ్...ఫీలింగ్స్ డోంట్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మలయాళంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ‘ప్రేమమ్’ చిత్రానికి రీమేక్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ కథానాయికలు. ‘ఓ యువకుడి జీవితంలో మూడు ప్రేమకథల సమ్మిళితంగా చిత్ర కథ సాగుతుందని.. తప్పకుండా ఈ చిత్రం ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని' అంటున్నారు.