Advertisementt

కాజల్ దే నంట....ఆ.. స్థానం !

Sat 12th Mar 2016 02:05 PM
kajal agarwal,temper tamil remake,simbu,south cine industry top heroine,kajal,top heroes  కాజల్ దే నంట....ఆ.. స్థానం !
కాజల్ దే నంట....ఆ.. స్థానం !
Advertisement
Ads by CJ

తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్‌స్టార్స్‌ అందరి సరసన నటించిన హీరోయిన్‌.. కాజల్‌ అగర్వాల్‌. అయితే మధ్యలో బాలీవుడ్‌పై మోజుపడి అక్కడకి వెళ్లి తిరిగి లాభం లేదని మరలా సౌత్‌ సినిమాలపైనే దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఆమె తెలుగులో 'టెంపర్‌' తర్వాత మరే చిత్రం చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్స్‌ అయిన పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటిస్తోంది. మరలా పోయిన చోటే వెతుక్కోవాలని డిసైడ్‌ అయిన ఈ భామ ప్రస్తుతం కోలీవుడ్‌లో కూడా విక్రమ్‌, జీవాల సరసన నటిస్తోంది. కాగా త్వరలో శింబు హీరోగా నటించనున్న 'టెంపర్‌' తమిళ రీమేక్‌లో కూడా ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. భారీ చిత్రాలు, స్టార్స్‌ చిత్రాల్లో నటిస్తూ తన పూర్వవైభవం కోసం, అగ్రపీఠం కోసం, సౌత్‌ సినీ ఇండస్ట్రీ నెంబర్‌వన్‌ పీఠంపై నిలవడమే తన ఏకైక లక్ష్యంగా ఆమె పేర్కొంది. మొత్తానికి ఈ భామ తాజా జోరు చూస్తే అది పెద్ద పని కాదనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ