Advertisementt

ఒక్క టికెట్‌పై రెండు సినిమాలు!

Sat 12th Mar 2016 01:54 PM
movie trailers in interval,fan movie,sultan,theri,kabali,tollywood  ఒక్క టికెట్‌పై రెండు సినిమాలు!
ఒక్క టికెట్‌పై రెండు సినిమాలు!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఓ చిత్రం ఇంటర్వెల్‌ సమయంలో మన ప్రేక్షకుల బయటకు వచ్చి తినుబండారాలు తింటూ సేద తీరుతారు. కానీ ఇంటర్వెల్‌ పడిన తర్వాత కూడా కుర్చీల్లో కూర్చోబెట్టడానికి నిర్మాతలు, హీరోలు తమ ఇగోలను పక్కన పెట్టి ముందుకు వస్తున్నారు. ఓ స్టార్‌ చిత్రం విడుదలవుతోందంటే దాని ఇంటర్వెల్‌లో మరో స్టార్‌ సినిమా థియేటికల్‌ ట్రైలర్స్‌ను చూపిస్తున్నారు. వాస్తవానికి బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ల మధ్య పోటీ ఏ లెవల్లో ఉందో అందరికీ తెలుసు. ఇక తమిళనాట కూడా రజనీకాంత్‌కు, విజయ్‌ల మధ్య హోరాహోరి పోరు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఇగోలను పక్కనపెట్టి 'ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో' చిత్రంలో షారుఖ్‌ 'దిల్‌వాలే' ట్రైలర్ ను వేశారు. తాజాగా షారుక్‌ నటిస్తున్న 'ఫ్యాన్‌' చిత్రం థియేటర్లలో సల్మాన్‌ నటిస్తున్న 'సుల్తాన్‌' ట్రైలర్‌ను చూపించనున్నారు. ఇక కోలీవుడ్‌లో ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్దం అవుతోన్న విజయ్‌ 'తేరీ' థియేటర్లలో రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' థియేటికల్‌ ట్రైలర్‌ను చూపించడానికి రంగం సిద్దమైంది. ఇలాంటి సహకారం వల్ల ఇద్దరు హీరోలు లాభపడే అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటివే జరుగుతున్నా కూడా స్టార్స్‌ కూడా ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టడం ముఖ్యమని అంటున్నాయి టాలీవుడ్‌ సినీ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ