Advertisementt

బన్నీ కోసం త్రివిక్రమ్‌ త్యాగం!

Fri 11th Mar 2016 11:16 PM
allu arjun,aa aaa movie,sarrinodu movie,trivikram srinivas,sardaar gabbar singh  బన్నీ కోసం త్రివిక్రమ్‌ త్యాగం!
బన్నీ కోసం త్రివిక్రమ్‌ త్యాగం!
Advertisement
Ads by CJ

వాస్తవానికి బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న 'సరైనోడు' చిత్రాన్ని ఏప్రిల్‌ 8వ తేదీన రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ అదే రోజున పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో వస్తుండటంతో బన్నీ చిత్రాన్ని ఏప్రిల్‌ 22న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అదే రోజును తన 'అ..ఆ' చిత్రం కోసం డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ డేట్‌ను లాక్‌ చేశాడు. కానీ 'సరైనోడు'ను అదే రోజున విడుదల చేయాలని అల్లు అరవింద్‌, బన్నీలు ఫిక్స్‌ కావడంతో బన్నీకి మంచి స్నేహితుడైన త్రివిక్రమ్‌ కాస్త వెనడుగు వేసి మే 6 వతేదీన 'అ..ఆ' (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. మొత్తానికి ఈ చిత్రం విడుదల తేదీ కోసం బన్నీకి దారిని ఇచ్చిన త్రివిక్రమ్‌ కాస్త వెనకడుగు వేశాడనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతను త్రివిక్రమ్‌ తీసుకున్నాడు. ఈ చిత్రంలో నితిన్‌ హీరోగా సమంత, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా నదియా కీలకపాత్రను పోషించనుంది. ఈ చిత్రంపై నితిన్‌ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు.ఈ చిత్రానికి మిక్కి.జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ