నాని, శర్వానంద్‌లను ఇప్పుడు చిన్న హీరోలుగా భావించలేం. వారు చిన్నస్ధాయి నుండి మీడియం రేంజ్‌కు ఎదిగిపోయారు. ఇక చిన్న హీరోలు ముగ్గురు నలుగురు మధ్య మాత్రం టాలీవుడ్‌లో ఆసక్తికరపోరు సాగుతోంది. వారే రాజ్‌తరుణ్, నాగశౌర్య, నారా రోహిత్, సందీప్‌కిషన్‌లు. వీరు మీడియం రేంజ్‌లోకి రావడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. తాజాగా నారారోహిత్ రేపు 'తుంటరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తమిళ 'మాన్‌కరాటే' చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. ఇక ఈ చిత్రం విడుదలైన రెండు వారాల గ్యాప్‌లోనే ఆయన 'సావిత్రి' చిత్రంతో వస్తున్నాడు. ఇక సందీప్‌కిషన్ విషయానికి వస్తే 'నేరమ్' చిత్రానికి రీమేక్‌గా 'రన్' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈయనకు 'వెంకట్రాది ఎక్స్‌ప్రెస్' తర్వాత సరైన హిట్ లేని విషయం తెలిసిందే. ఇక రాజ్‌తరుణ్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఊపుమీద ఉన్న సమయంలో వచ్చిన 'సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు' చిత్రం ఆయనకు స్పీడ్ బ్రేకర్ వేసింది. దీంతో ఆయన తన తర్వాతి చిత్రం ద్వారా మరలా రేసులో ముందుండాలని కసితో ఉన్నాడు. తన కెరీర్‌లో 'ఊహలు గుసగుసలాడే' తప్ప మరో హిట్ ఎరుగని నాగశౌర్య సైతం ఇటీవల వచ్చిన 'కళ్యాణవైబోగమే' చిత్రంతో మరలా ఫామ్‌లోకి వచ్చాడు. మరి రాబోయే రోజుల్లో వీరిలో ఎవరు ఏ విధంగా దూసుకుపోతారో వేచిచూడాల్సివుంది.