ఒక్క ప్రొమోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' ఆడియోకు డేట్‌ను నిర్మాతలు ఫిక్స్ చేశారు. మార్చి 18న ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని గచ్చిబౌళి స్టేడియంలో పవన్ అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గచ్చిబౌళి స్టేడియంలో అనుమతి లభించకపోతే ఈ వేడుకకు నిజాం కాలేజీ గ్రౌండ్‌ను ఆల్టర్‌నేటివ్‌గా భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ పురాతన భవనంలో జరుగుతోంది. ఇక్కడ భారీ ఎత్తున క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు రామ్-లక్ష్మణ్‌లు నేతృత్వం వహించనున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ రెండుపాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లనుంది. ఇక 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ప్రసారం చేయడానికి వివిధ చానెల్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఇందులో జెమిని, మా టీవీలు ముందు వరుసలో ఉన్నాయి. మా చానెల్ కోటి 25లక్షలు ఆఫర్ చేయగా, జెమిని టీవీ ఒకటిన్నర కోటి ఆఫర్ చేసిందని సమాచారం. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో వేచిచూడాల్సివుంది. కాగా ఇటీవల రామోజీఫిలింసిటీలో ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పవన్‌కళ్యాణ్ రామోజీరావును ఏకాంతంగా కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వీరి మధ్య జనసేన పార్టీ భవిష్యత్తు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, రాజధాని ప్రాంతంలో స్థలాల విషయంలో జరుగుతున్న రచ్చతో పాటు 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం విషయంపై సైతం చర్చలు జరిగినట్లు సమాచారం.