Advertisementt

ఎన్టీఆర్‌కు మోక్షు షాక్‌ ఇస్తాడా!

Fri 11th Mar 2016 05:33 PM
jr ntr,mokshagna,balakrishna,aditya 999,mokshagan entry soon  ఎన్టీఆర్‌కు మోక్షు షాక్‌ ఇస్తాడా!
ఎన్టీఆర్‌కు మోక్షు షాక్‌ ఇస్తాడా!
Advertisement
Ads by CJ

వాస్తవానికి నందమూరి సీనియర్‌ స్టార్‌ బాలకృష్ణ రూటు వేరు. జూనియర్‌ ఎన్టీఆర్‌ రూటు వేరు. దాంతో ఎన్టీఆర్‌ తెరంగేట్రం చేసినప్పటికీ బాలయ్యకు.. ఎన్టీఆర్‌ నుండి భారీ పోటీ ఎదురుకాలేదు. బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్‌ను పోటీగా భావించలేదు. కాగా త్వరలో మరో నందమూరి వారసుడు, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఖరారైన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా రూపొందనున్న 'ఆదిత్య 999' చిత్రంతో తనతోటి తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నాడని బాలయ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ చేస్తే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు మాత్రం పోటీ తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌కు ఇప్పటికే యంగ్‌స్టార్స్‌ వరుసలో చోటు దక్కిందని, రాబోయే రోజుల్లో అంటే మోక్షజ్ఞ ఎంట్రీలోపు ఎన్టీఆర్‌కు మరో బ్లాక్‌బస్టర్‌ పడితే మోక్షజ్ఞ అరంగేట్రం సమయానికే ఎన్టీఆర్‌ పీక్‌లో ఉంటాడని, బాలయ్యకు ఎన్టీఆర్‌ ఎలా పోటీకాలేదో మోక్షజ్ఞ కూడా ఎన్టీఆర్‌కు పోటీ కాడని కొందరు వాదిస్తున్నారు. మరి నందమూరి అభిమానుల నిర్ణయం ఎలా ఉంటుందో ? వారు ఎవరివైపు ఆకర్షితులు అవుతారు? బాలయ్య తర్వాత నందమూరి హీరోగా ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకుంటారా? లేక నందమూరి వారసుడిగా మోక్షజ్ఞవైపు మొగ్గుతారో వేచిచూడాల్సి చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ