Advertisementt

సమంత నిజంగానే మాయ చేస్తుందిగా!

Fri 11th Mar 2016 04:31 PM
samantha,samantha new movies,samantha in naga chaitanya and kalyan krishna movie,samantha movies updates  సమంత నిజంగానే మాయ చేస్తుందిగా!
సమంత నిజంగానే మాయ చేస్తుందిగా!
Advertisement
Ads by CJ

రోజుకో కొత్త అమ్మాయి పరిచయం అవుతున్న సమయంలో ఎప్పుడో వచ్చిన సమంత ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్‌గా ఇప్పటికీ మాయ చేస్తోంది. హీరోలను బుట్టలో వేసుకుంటోంది. ఈమె దూకుడు చూసి మిగిలిన హీరోయిన్లు బేజారెత్తిపోతున్నారు. ఎన్టీఆర్‌తో 'బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస' చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఎన్టీఆర్‌ సరసన 'జనతాగ్యారేజ్‌'లో కూడా చేస్తోంది. ఇక మహేష్‌బాబుతో 'దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలలో చేసిన ఆమె ప్రస్తుతం 'బ్రహ్మూెత్సవం'లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య సినిమా 'ఏ మాయ చేసావే'తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత 'ఆటోనగర్‌ సూర్య, మనం' చిత్రాల్లో కలిసి నటించింది. తాజాగా ఆమె నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. మొత్తానికి తన మాయతో ఆమె హీరోలను కట్టిపడేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ