Advertisementt

అ... ఆ, వచ్చేస్తారా?

Thu 10th Mar 2016 09:12 PM
a aa,trivikram srinivas,nithin,release date  అ... ఆ, వచ్చేస్తారా?
అ... ఆ, వచ్చేస్తారా?
Advertisement
Ads by CJ

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్, ప్రస్తుతానికి ఇద్దరూ వెనకపడిపోయిన వారి జాబితాలో చేరడానికి అన్ని అర్హతలు కలిగిన పేర్లే. ఇండస్ట్రీ హిట్టు కొట్టిన త్రివిక్రమ్, నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న నితిన్; పాపం ఇద్దరికీ అ.. ఆ చిత్రమే అతిపెద్ద ఆశగా అవతరించింది. ఎన్నో కారణాల వల్ల షూటింగ్ నింపాదిగా జరుపుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషలుగా అలరించడానికి తయారవుతోంది. ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాని విడుదల తేదీ వ్యవహారం ఇప్పుడేమో మే నెలలో 6వ తారీఖు వరకు వచ్చింది. ఎంత వరకు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, ఇంకెంత భాగం మిగిలి ఉంది లాంటి సమాచారం మీడియా మిత్రులకే తెలియకుండా పోయింది. అప్పుడెప్పుడో టైటిల్ లోగో అంటూ పలకరించిన అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి మళ్ళీ ఇన్నాళ్ళకు కొత్త అప్ డేటుతో ముందుకొచ్చింది. సమంత, అనుపమ పరమేశ్వరన్, నదియాలతో పాటు మంచి క్యాస్టింగ్ వ్యాల్యూతో మరో సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేదిని తలపించే రీతిలో అగుపిస్తున్న అ.. ఆ మరో పర్ఫెక్ట్ త్రివిక్రమ్ మార్క్ ఫిలింగా నిలిచిపోతోంది అంటున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్ మరింత సమాచారం కోసం వేచి చూద్దాం!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ