Advertisementt

ఎన్టీఆర్‌ ఆశలను దెబ్బకొట్టిన శింబు!

Thu 10th Mar 2016 08:01 PM
ntr,temper movie,thamil remake,simbu  ఎన్టీఆర్‌ ఆశలను దెబ్బకొట్టిన శింబు!
ఎన్టీఆర్‌ ఆశలను దెబ్బకొట్టిన శింబు!
Advertisement

తెలుగులో ఎలాగైతే తమిళ స్టార్స్‌ అయిన అజిత్‌, విజయ్‌ల సినిమాలను డబ్బింగ్‌ చేసుకొనే అవకాశం ఇవ్వకుండా ఆయా చిత్రాలను రీమేక్‌లు చేయాలని భావిస్తున్నారో... ఇప్పుడు తమిళ హీరో శింబు కూడా అదే రూట్‌ ఫాలో అవుతూ ఎన్టీఆర్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం మలయాళ, తమిళ భాషల్లో కూడా తన క్రేజ్‌ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. దాంతో పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' మూవీని తమిళంలోకి డబ్బింగ్‌ చేయాలనే ఆశతో డబ్బింగ్‌ వెర్షన్‌ను కూడా రెడీ చేశాడు. కానీ బండ్ల గణేష్‌ మాత్రం ఈ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేయడం కంటే రీమేక్‌ రైట్స్‌ అమ్మితేనే తనకు ఆర్దికంగా లాభసాటిగా ఉంటుందని భావించాడు. ఈ చిత్రం చూసిన తమిళ స్టార్‌ శింబు ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపడంతో డబ్బింగ్‌ వెర్షన్‌ను విడుదల ఆపుచేసి తమిళంలోకి రీమేక్‌ రైట్స్‌ అమ్మేశాడు. దాంతో పాపం... ఎన్టీఆర్‌ చాలా బాధపడ్డాడని, ఇక నుండి తాను చేయబోయే చిత్రాల విషయంలో డబ్బింగ్‌ విషయంలో కూడా తను కండీషన్స్‌ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement