Advertisementt

'సరైనోడు' తో సమస్యల్లో చిక్కుకోవద్దు!

Thu 10th Mar 2016 10:33 AM
sarrinodu,leaked song,warning,sarrinodu song leaked,allu ajrun,geetha arts  'సరైనోడు' తో సమస్యల్లో చిక్కుకోవద్దు!
'సరైనోడు' తో సమస్యల్లో చిక్కుకోవద్దు!
Advertisement
Ads by CJ

సరైనోడు చిత్రానికి సంబంధించిన లీకైన ఆడియో సాంగ్ ఉపయోగిస్తే చట్టరిత్యా చర్యలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బొలీవియాలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ లొకేషన్స్ లో ఎవ్వరూ చిత్రీకరించలేదు. 

ఇదిలా ఉంటే.. సరైనోడు చిత్రానికి సంబంధించి లీక్ అయిన ఆడియో సాంగ్ ను ఎక్కడ, ఎవరు, ఏ విధంగా ఉపయోగించినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని నిర్మాతలు హెచ్చరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి... ఎన్నో వ్యయప్రయాసలకోర్చి... ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన సరైనోడు చిత్రానికి సంబంధించిన లీక్ అయిన కంటెంట్ ను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకోవద్దని నిర్మాతలు తెలియజేశారు.  

ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ