హీరోలు ఈమధ్యకాలంలో తమ సొంత గొంతులతో పాటలు పాడి ఆయా చిత్రాలకు, ఆల్బమ్స్‌కు హైలైట్‌గా నిలుస్తున్నారు. పవన్‌కళ్యాణ్ నుండి మంచు మనోజ్, సంపూ వరకు ఇదే వరస. ఇక ఎన్టీఆర్ అయితే 'యమదొంగ'లో పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. 'రభస, నాన్నకు ప్రేమతో' చిత్రాలలో కూడా పాటలు పాడి అందరినీ మెప్పించాడు. కానీ ఇంతవరకు కేవలం తన సినిమాల్లోనే పాటలు పాడిన ఎన్టీఆర్ తాజాగా కన్నడలో పునీత్‌రాజ్‌కుమార్ హీరోగా తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన 'చక్రవ్యూహ' చిత్రంలో ఓ కన్నడ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటను తమన్ తన అభిమానుల కోసం సోషల్‌మీడియాలో పెట్టాడు ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. 'గెలియా..గెలియా' అంటూ ఈ పాటలో ఎన్టీఆర్ తన సింగింగ్ టాలెంట్‌తో అదరగొట్టాడు. ఈ పాటను విని ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొత్తానికి ఈ పాటతో ఎన్టీఆర్ తానో ప్రొఫెషనల్ సింగర్ అనిపించుకుంటున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.