Advertisementt

అయోమయంలో మహేష్‌ హీరోయిన్‌!

Wed 09th Mar 2016 06:42 PM
mahesh babu,sruthi hassan,keerthi suresh,parineethi chopra  అయోమయంలో మహేష్‌ హీరోయిన్‌!
అయోమయంలో మహేష్‌ హీరోయిన్‌!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఎందరు కొత్త హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు.. కానీ ఇప్పటికీ హీరోలకు మరీ ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోతోంది. అందునా రిపీట్‌ కాంబినేషన్స్‌ చేయడానికి అంతగా ఇష్టపడని మహేష్‌బాబు కూడా కాజల్‌, సమంత వంటి హీరోయిన్లను రిపీట్‌ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మహేష్‌లాంటి స్టార్‌హీరోకు కొత్త జోడీని వెతకటం అంత సులువు కాదు. అందంగా ఉండాలి.. మహేష్‌ పక్కన సరిజోడీగా నిలిచి ముచ్చటైన జంటగా కనిపించాలి. స్క్రీన్‌పై మహేష్‌కు సరిజోడిగా గుర్తింపు తెచ్చుకుని కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యేలా చూసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు అవసరం కావడంతో మహేష్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రం కోసం హీరోయిన్ల అన్వేషణ చాలాకాలంగా జురుగుతోంది. ఇప్పటికే 'నేను...శైలజా' ఫేమ్‌ కీర్తిసురేష్‌, శృతిహాసన్‌ల పేర్లు వినిపించాయి. మధ్యలో బాలీవుడ్‌ హీరోయిన్లు శ్రద్దాకపూర్‌, పరిణితి చోప్రాల పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇంతకీ మహేష్‌ సరసన కొత్త భామకు అవకాశం ఇస్తారా? లేక శృతిహాసన్‌ వంటి వారితోనే సర్దుకుపోతారా? అనేది తేలాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ