హీరో అంటే సిక్స్‌ప్యాక్ ఉండాల్సిందేనా.. గతంలో ఈ జాడ్యం కేవలం హాలీవుడ్, బాలీవుడ్‌లకు మాత్రమే ఉండేది. అది ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు కూడా పాకింది. సీనియర్ స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగిన చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వంటి వారితో పాటు దక్షిణది స్టార్స్ అయిన రజనీ, కమల్ వంటి వారు ఏం సిక్స్‌ప్యాక్‌లు చేసి మెప్పించారా? వారు తమ సహజసిద్దమైన బాడీలతోనే తమ నటన, స్లైల్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించలేదా? అనే ప్రశ్న వేసుకోవాల్సివస్తుంది. ఈ సిక్స్‌ప్యాక్‌లు హీరోల మంచికా? లేక చెడుకా?అనే విషయంలో ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. అభిమానుల కోసం, విభిన్నంగా కనిపించడం కోసం బన్నీ మొదలు నిన్నటి రవితేజ వరకు సిక్స్‌ప్యాక్ మోజులో పడుతున్నారు. ఇప్పటికీ ఈ సిక్స్‌ప్యాక్‌లకు పవన్ తాను చాలా దూరం అని ప్రకటించాడు. కానీ మహేష్‌బాబు మాత్రం '1'(నేనొక్కడినే) చిత్రం కోసం సిక్స్‌ప్యాక్ చేశాడు. కానీ ఆ చిత్రంలో ఆయన మొహంలోని గ్లామర్ బాగా దెబ్బతిని కనిపించింది. దాంతో మరలా 'ఆగడు, శ్రీమంతుడు' చిత్రాలలో తన ఓన్‌స్టైల్‌లోనే కనిపించాడు మహేష్. అసలు 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్ ఎంత అందంగా కనిపించాడో ఇప్పటికైనా ఆయనకు, ఆయన అభిమానులకు అర్థమై ఉంటుంది. ఇక సునీల్ పరిస్థితి మరీ ఘోరం. ఆయన లావుగా, బొద్దుగా ఉండే ఆయన ఫిజిక్కే మొదట్లో ఆయనను కామెడీ నటునిగా, కామెడీ హీరోగా మంచి గుర్తింపును తెచ్చింది. కానీ ఏ ముహూర్తాన 'పూలరంగడు' కోసం ఆయన సిక్స్‌ప్యాక్ పెంచాడో ఆయన ఫేస్‌ను క్లోజప్‌లో చూడటానికే ఇబ్బందికరంగా మారుతోంది. కానీ ఇన్ని తెలిసినప్పటీకి 47 ఏళ్లకు పైగా వయసులో రవితేజ తన తదుపరి చిత్రం కోసం సిక్స్‌ప్యాక్ పెంచాడు. ఇప్పటికే సన్నబడి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తున్న రవితేజ ఈ సిక్స్‌ప్యాక్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తాడో లేదా ఇతర హీరోల్లాగా ఉన్న గ్లామర్‌ను చెడగొట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది.