Advertisementt

చిరు 150, మళ్ళీ కొత్త డేటు వచ్చిందోచ్!

Wed 09th Mar 2016 02:54 PM
chiranjeevi 150th,april third week  చిరు 150, మళ్ళీ కొత్త డేటు వచ్చిందోచ్!
చిరు 150, మళ్ళీ కొత్త డేటు వచ్చిందోచ్!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో నిజంగా ఇంకా ఎవరికీ అంతుపట్టని రహస్యంగానే ఉన్నా మీడియా వారు మాత్రం తమకు మూడొచ్చిన ప్రతిసారీ ఓ కొత్త డేటుతో ప్రచారం పుట్టించేస్తున్నారు. కథాపరంగా అయితే తమిళంలో సూపర్ హిట్టయిన కత్తినే ఇక్కడ తెలుగులో మళ్ళీ సానపెడుతున్న విషయం విదితమే, అదీ వీవీ వినాయక్ గారి దర్శకత్వంలో. ఇక ఎట్టి పరిస్తుతుల్లోను చిరంజీవి 150వ మూవీ రిలీజ్ ఈ ఏడాదిలోనే ఉండాలని పట్టుపడుతున్న మెగా అభిమానుల కోరిక తీరేట్టుగానే ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, చిరంజీవి కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28 అనంతరం మెగా స్టార్ తన పూర్తి సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సుమారుగా ఏప్రిల్ థర్డ్ వీక్ కల్లా స్క్రిప్ట్ పకడ్బందీగా పూర్తవడంతో పాటు షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఖరారయిపోవడం ఖాయం. అక్కడి నుండి మూడు నెలలు నాన్ స్టాపుగా షూటింగ్ లాగించేస్తే ఆగస్టు కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోవడం, అటు తరువాత సెప్టెంబర్ అండ్ అక్టోబర్ వదిలేసినా నవంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం అవ్వొచ్చు. సో, ఏడాది చివర్లో మన మెగా కత్తి తయ్యార్!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ