Advertisementt

సూపరుగా వర్క్ అవుట్ చేస్తున్న సుప్రీం!

Wed 09th Mar 2016 02:23 PM
supreme,pre release business,dil raju  సూపరుగా వర్క్ అవుట్ చేస్తున్న సుప్రీం!
సూపరుగా వర్క్ అవుట్ చేస్తున్న సుప్రీం!
Advertisement
Ads by CJ

 

దిల్ రాజు సినిమా లెక్కలు మామూలుగా ఉండవులెండి. అటు నిర్మాతగా అయినా, ఇటు పంపిణీదారుడిగా అయినా ఈయన నుండి సినిమా వస్తుందన్నా లేక ఈయన పంపిణీ హక్కులు కొనుకున్నాడన్నా ఆ సినిమా మీద అంచనాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతాయి. అందుకే ఇప్పుడు అందరి కళ్ళూ ఏప్రిల్ 1న రిలీజుకు సిద్ధమవుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ సుప్రీం మీద పడ్డాయి. ఇప్పటిదాకా ఈ కుర్ర మెగా ఫ్యామిలీ హీరోకి సాలిడ్ హిట్టు లేదు కానీ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి మినిమమ్ గ్యారంటీ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజి ఏర్పరుచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ నుండి వస్తున్న అమొఘమైన ఆదరణని సరిగ్గా ఎలా వాడుకోవాలో దిల్ రాజుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు కాబోలు. అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సుప్రీం సినిమాకు అన్ని చోట్ల విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే సినిమా మొత్తాన్ని 15 కోట్ల లోపే (ప్రమోషన్స్ సహా) పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించిన దిల్ రాజు, ప్రీ రిలీజ్ బిజినెస్ (శాటిలైట్ సహా) లెక్కల ప్రకారం పాతిక కోట్లు సంపాదించబోతున్నాడు అని టాక్. ఎటు చూసినా పది కోట్లు మిమినం లాభాలు. అంతా మెగా మహిమ!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ