Advertisementt

బాలయ్య 100వ చిత్రం 75 శాతం ఖరారు!

Wed 09th Mar 2016 02:11 PM
balakrishna,krish,sai madhav burra,gauthami puthra satakarni,krishna vamsi  బాలయ్య 100వ చిత్రం 75 శాతం ఖరారు!
బాలయ్య 100వ చిత్రం 75 శాతం ఖరారు!
Advertisement
Ads by CJ

'లయన్‌', 'డిక్టేటర్‌' చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ దృష్టంతా తన వందవ సినిమాపైనే పెట్టారు. అయితే ఇద్దరు దర్శకులు ఇందుకు పోటీపడుతున్నారు. ఒకరు కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అయిన కృష్ణవంశీ, మరొకరు క్రిష్‌.ఈ ఇద్దరు చెప్పిన కథలూ బాలయ్యను ఆకట్టుకున్నాయట. అందులో ఒకటి 'రైతు' కాగా రెండోది 'గౌతమీపుత్ర శాతకర్ణి'. అయితే ఈ రెండు కథలకు బాలయ్య యాప్ట్‌ అయిన హీరో. అమావాస్య తర్వాత తన వందో చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ 75 శాతం 'శాతకర్ణి' చిత్రాన్ని ఖరారు చేశారనీ, డైలాగ్‌ వర్షన్‌ కూడా మొదలయిందని తెలుస్తోంది. 'కృష్ణంవందే జగద్గురుమ్‌', 'గోపాల గోపాల', 'మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' చిత్రాలకు సంభాషణలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి మాధవ్‌ బుర్రా ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ