హీరో మంచు మనోజుకు సినిమా పట్ల ఉండే అంకితభావం మనకు కొత్తగా తెలియనిది ఏమీ కాదు. స్టోరీ నుండి టేకింగ్ వరకు, అన్నింటిలో వేలు పెట్టి తాను ఆల్ రౌండర్ అన్న విషయాన్ని ముందుగా సినిమాను డీల్ చేసే దర్శకుడి దగ్గరి నుండి ధియేటర్లో టిక్కెట్ కొనుక్కుని చూసే ప్రేక్షకుడి వరకు తెలియాలని తాపత్రేయపడుతుంటాడు. అందుకే ఈ పనికిరాని ఉత్సూకతతో హిట్టు అనే బ్రహ్మ పదార్థానికి నోచుకోకుండా తన టాలెంటు మొత్తాన్ని మరుగున పడేసుకుంటున్నాడు. అదే దారిలో మొన్నొచ్చిన శౌర్య కూడా అపజయాల ఖాతాలో టాప్ పొజిషన్ మీద తిష్టేసుకు కూర్చుంది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిటిక్స్ వైపు నుండి పాస్ మార్కులు వేయించుకోవడానికి అష్టకష్టాలు పడింది. అసలు విషయానికి వస్తే శౌర్య కథను వినిపించే ముందే దశరథ్ గారు మనోజ్ దగ్గర ఓ కండిషన్ పెట్టారట. ఎప్పుడూ టచ్ చేయని థ్రిల్లింగ్ లవ్ స్టోరీ కావడంతో, తన పని మధ్యలో కాలు, వేలు పెట్టి డిస్టర్బ్ చేయనని మనోజ్ ప్రామిస్ చేస్తేనే ఈ కథను డీల్ చేస్తానని లేకపోతే వేరే హీరోను వెతుక్కుంటానని ఖరాఖండీగా అనడంతో మనోజ్ అన్నింటికీ ఒప్పుకుని డీల్ సైన్ చేసారంట. ఇక శౌర్యను తెర మీద చూస్తుంటే దశరథ్ కన్నా మనోజ్ అయితే వెయ్యి రెట్లు బెటరుగా తీసేవాడేమోనని అనిపించకమానదు. ఇప్పుడు తెలిసిందా మంచు వారి ఫింగరింగ్ ఎంతటి ప్రాముఖ్యతని సంతరించుకుంటుందో?